![]() |
![]() |
.webp)
కొన్ని కథలు చూస్తుంటే మనం అందులో ఇన్వాల్వ్ అవుతాం. అలా చూస్తూ చూస్తూ ఉండిపోతాం. అంత చక్కని కథని స్టార్ మా అభిమానులకి దగ్గర చేస్తుంది ' ఎటో వెళ్ళిపోయింది మనసు ' సీరియల్.
కొత్త నటీనటులు, కొత్త కథ, ఢిఫరెంట్ గా చూపిస్తున్న ఈ సీరియల్ రోజు రోజుకు ఫ్యాన్ బేస్ పెంచుకుంటుంది. దానికి కారణం రామలక్ష్మి, సీతాకాంత్ ల జోడీ. బ్రహ్మముడి కావ్య, రాజ్ ల తర్వాత గుప్పెడంత మనసు రిషి, వసుధారలు ఉండగా.. మళ్ళీ అంతటి క్రేజ్ వీరిద్దరికే వస్తోంది. సీతాకాంత్, రామలక్ష్మిలకి ఇన్ స్టాగ్రామ్ లో సపరేట్ ఫ్యాన్ పేజీలు కూడా ఉన్నాయి. అయితే ఈ సీరియల్ అంత హిట్ అవ్వడానికి కారణమేమంటే.. రామలక్ష్మి, సీతాకాంత్ గత జన్మలో ప్రేమించుకుంటారు. కానీ విధి వీరిద్దరిని దూరం చేస్తుంది. అయితే ఆ జన్మ జ్ఞాపకాలు ఎప్పుడు సీతాకాంత్ ని వెంబడిస్తూనే ఉంటాయి. అదే సమయంలో రామలక్ష్మి కనపడటం.. స్వామిజీ చెప్పినట్టు రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్ళి చేసుకుంటాడు.
అయితే ఈ సీరియల్ మొదట్లో తన చెల్లి సిరి కోసం రామలక్ష్మిని సీతాకాంత్ పెళ్లి చేసుకుంటాడు. మాణిక్యం తన కొడుకు ధనతో సిరి పెళ్ళి జరిపించడమే కాకుండా సీతాకాంత్ ఆఫీస్ లో ఉద్యోగం కూడా ఇచ్చేలా చేస్తాడు. రామలక్ష్మికి సీతాకాంత్ పై ప్రేమ మొదలవుతుంది. కానీ సీతాకాంత్ తనకి భార్య స్థానం ఇవ్వలేదని అనుకుంటుంది. అదే సమయంలో రామలక్ష్మి కూడా తనకి భర్త స్థానం ఇవ్వలేదేమోనని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. ఇక వీరిమధ్య దూరం పెంచడానికి సవతి తల్లి శ్రీలత, ఆమె కొడుకు సందీప్, కోడలు శ్రీవల్లి ప్లాన్ చేస్తుంటారు. మరోవైపు సీతాకాంత్ , రామలక్ష్మిలకి సపోర్ట్ గా పెద్దాయన ఉంటాడు. మరి గత జన్మలోని ఈ ప్రేమికులు ఈ జన్మలో కలుస్తారా లేదా అనేది మిగతా కథ. తాజాగా యూట్యూబ్ లో రిలీజైన ప్రోమోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తోంది. బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్స్ తో పోటీపడుతూ ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీని పొందుతుంది.
షణ్ముఖ్ జస్వంత్ అలియాస్ షన్ను యూట్యూబర్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసాడు మూవీస్ లో, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. బిగ్ బాస్ కి వెళ్ళాడు. దీప్తి సునాయానాతో ఫ్రెండ్ షిప్ చేసాడు. తర్వాత దీప్తి వదిలేసింది. ఇక షన్ను కూడా చాలా ఇష్యుస్ లో పట్టుబడడం వంటివి జరిగాయి. ఆ తర్వాత అసలు షన్ను కనిపించడమే మానేసాడు. అలాంటి షన్ను రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు. "మీకు కూడా మీ కుటుంబంలో ఎవరైనా స్నేహితుడు లేదా సిఏ విద్యార్థి ఉన్నట్లయితే అతను సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు మీ ఫ్రెండ్స్ , ఫామిలీ మెంబర్స్ వారిని ప్రోత్సహించండి సపోర్ట్ చేయండి. సిఏ చదివేవారికి కాదు అందరికీ సపోర్ట్ అవసరం. నాకు చాలాసార్లు చావాలని అనిపించేది. కానీ ధైర్యంగా ఉండడం నేర్చుకున్నా. ఎన్ని సమస్యలు వచ్చినా నేర్చుకోడానికి ప్రయత్నిస్తాను కానీ ఒక్కసారి మనం ఆత్మహత్య చేసుకుంటే ప్రపంచంలో ఎవ్వరూ పట్టించుకోరు కుటుంబం తప్ప ... దయచేసి ఏ సమస్యనైనా ధైర్యంతో ఎదుర్కోండి .. నొప్పిని తట్టుకుంటే ఆ దేవుడే మీకు మంచి మార్గం చూపిస్తాడు. నాకు అర్ధమైన విషయం మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని " అంటూ హితవు చెప్పాడు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలం అంటూ ఈ పోస్ట్ లో తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.
![]() |
![]() |